వాట్సాప్‌కు 12 ఏళ్లు.. 200 కోట్ల యూజర్లు.. 100 బిలియన్ మేసేజ్‌లు

గురువారం, 25 ఫిబ్రవరి 2021 (15:27 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి వాట్సాప్‌ సంస్థ గురువారం (ఫిబ్రవరి 25)తో 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ పుష్కర కాలంలో సంస్థ సాధించిన ఘనతలను చెబుతూ 12వ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా వాట్సాప్ ద్వారా వెళ్తున్న మెసేజ్‌లు, వాయిస్ కాల్స్‌, వీడియో కాల్స్ గణాంకాలను పంచుకుంది. ఈ 12 ఏళ్లలో వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకుంది.
 
వాట్సాప్ నుంచి ప్రతి నెలా ఈ 200 కోట్ల మంది యూజర్లు ఏకంగా పది వేల కోట్ల మెసేజ్‌లు వెళ్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. అంతేకాదు రోజుకు 100 కోట్ల కాల్స్ కూడా వాట్సాప్ నుంచి వెళ్తుండటం విశేషం. ఇక యూజర్ల ప్రైవసీకి కట్టుబడి ఉంటామని వాట్సాప్ మరోసారి స్పష్టం చేసింది. తమ ప్లాట్‌ఫామ్‌పై ఎప్పటికీ ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుందని కూడా తేల్చి చెప్పింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు