అయితే ఈ లీకులు నిజమో కాదో తెలియాలంటే మాత్రం జనవరి 18వ తేదీ వరకు ఆగాల్సిందే. ఇందులో 6.72 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించనున్నారు. ఈ డిస్ ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 300 హెర్ట్జ్‌గానూ ఉండే అవకాశం ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్‌పై హానర్ వీ40 పనిచేయనుంది. ఇందులో 5జీ ఫీచర్‌ను కూడా అందించనున్నారు.
ఈ ఫోనులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత మ్యాజిక్ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే అవకాశం ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ లేదా 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది.
8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌లు ఇందులో ఉండనున్నాయి. ఇక ముందువైపు రెండు సెల్పీ కెమెరాలు అందించనున్నారు. 32 మెగాపిక్సెల్, 16 మెగాపిక్సెల్ సెన్సార్లు ఇందులో ఉండనున్నాయి.