రిలయన్స్ జియో దెబ్బకు అన్ని ప్రైవేట్ టెలికాం సంస్థతో పాటు ప్రభుత్వ టెలికాం సంస్థ ధరలను గణనీయంగా తగ్గించే చర్యల్లో పోటీ పడుతున్నాయి. ఇందులోభాగంగా, ఇప్పటికే బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్ సంస్థలు డేటా చార్జీలను తగ్గించాయి. తాజాగా ఐడియా సెల్యులార్ సంస్థ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
తామందిస్తున్న ఐడియా సెల్యులార్ మూవీ క్లబ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఏ మాత్రం డేటా ఖర్చు కాకుండా కావాల్సినన్ని సినిమాలను నచ్చిన క్వాలిటీలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, ఈ సౌకర్యం ఐడియా వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ యాప్‌తో ఒకేసారి రెండు వీడియోలను కూడా చూడవచ్చని ఐడియా పేర్కొంది.
వాస్తవానికి స్మార్ట్‌ఫోన్ నుంచి ఓ సినిమాను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే దానికి ఎంతో డేటా ఖర్చవుతుంది. కానీ, ఐడియా మాత్రం డేటా ఖర్చు లేకుండానే ఈ బంపర్ ఆఫర్ ప్రకటించడం గమనార్హం. అయితే, ఈ యాప్ ప్రాచుర్యంలోకి వచ్చిన తరువాత కొంత ఛార్జీలను వసూలు చేసే అవకాశం లేకపోలేదు.