నేటి యువత డ్రీమ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరడం. ఇందుకోసం అనేక మంది యువతీయువకులు రేయింబవుళ్లు శ్రమిస్తుంటారు. కానీ, ఈ బుడ్డోడు మాత్రం కేవలం 13 యేళ్ళకే టెక్కీ అయిపోయాడు. ఫలితంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మారిపోయాడు. అదీకూడా మరో కంపెనీలో చేరడం కాదు. ఏకంగా తానే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీని పెట్టాడు. అలా టెక్కీ అయిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిద్ధాం.
నెమ్మదిగా కంప్యూటర్ లాంగ్వేజీలను కూడా నేర్చుకోవడం ప్రారంభించాడు. తనే సొంతంగా ఇంటర్నెట్‌లో చూసి నేర్చుకున్నాడు. సాఫ్ట్‌వేర్ లాంగ్వేజీలన్నీ నేర్చుకున్నాక.. బోరు కొడుతుంటే తన తొమ్మిదేళ్ల వయసులో ఏకంగా మొబైల్ అప్లికేషన్‌నే డెవలప్ చేశాడు. అది సక్సెస్ అవడంతో ఇక.. వెనక్కి తిరిగి చూసుకోలేదు రాజేశ్. ఆ తర్వాత వైబ్‌సైట్లను డెవలప్ చేయడం, లోగోలు డిజైన్ చేయడం ప్రారంభించాడు.
అలా.. తన 13 ఏళ్ల వయసులో దుబాయ్‌లో ట్రైనెట్ సొల్యూషన్స్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీని నెలకొల్పాడు. ప్రస్తుతం తన కంపెనీలో ముగ్గురు ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రస్తుతం 12 మంది క్లయింట్లు కూడా ఉన్నారట. కాకపోతే మనోడి వయసు 18 దాటలేదు కదా. అందుకే.. కంపెనీలాగ తన ఎంప్లాయిస్‌తో కలిసి క్లయింట్లకు వర్క్ చేస్తున్నాడట. రాజేశ్.. తన క్లయింట్లకు ఉచితంగా అప్లికేషన్లు డెవలప్ చేసి ఇస్తున్నాడట.