ఇన్ఫోకస్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్... ఫింగర్‌ప్రింట్ స్కానర్... ధర.12,999/-
మంగళవారం, 25 అక్టోబరు 2016 (14:37 IST)
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల సంస్థ ఇన్ఫోకస్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. ఇన్ఫోకస్ ఎపిక్ 1 పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.12,999గా కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అమెజాన్ సైట్ ద్వారా లభ్యం కానుంది. కాగా ఈ ఫోన్లో డెకా కోర్ (10 కోర్లు) ప్రాసెసర్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూనిమెటల్ బాడీ వంటి పవర్ఫుల్ ఫీచర్లను అందిస్తున్నారు.
ఇన్ఫోకస్ ఎపిక్ 1 ఫీచర్లను పరిశీలిస్తే...
* 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ఎల్టీపీఎస్ డిస్ప్లే 1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్