సోషల్ మీడియాలో స్థానం సంపాదించుకున్న ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్ చేరింది. ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఒకేసారి మల్టిపుల్ ఫోటోలను షేర్ చేసుకునేందుకు ఇక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఒకే ఆల్బమ్‌లో అనేక ఫోటోలను షేర్ చేసుకునే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ నెల మొదట్లో ఇన్‌స్టాగ్రామ్ తొలుత బీటా స్టేజ్‌లో ఈ ఫీచర్‌ను పరీక్షించడంతో సక్సెస్ అయినట్లు ఇన్‌స్టాగ్రామ్ ఓ ప్రకటనలో తెలిపింది.