రిలయన్స్ జియో నుంచి 5జీ నెట్‌వర్క్ ఫోను.. దీపావళి కల్లా వచ్చేస్తుందా?

బుధవారం, 17 ఆగస్టు 2022 (13:05 IST)
రిలయన్స్ జియో నుంచి అతి త్వరలో దేశంలో 5జీ నెట్‌వర్క్ ఫోను అందుబాటులోకి రానుంది. ఇదే నెలలో 5జీ సర్వీస్‌లను లాంచ్ చేసేందుకు జియో రెడీ అయ్యింది. ఈ 5జీ చౌకైన మొబైల్‌కు సంబంధించిన కొన్ని విషయాలు తాజాగా బయటికి వచ్చాయి. ఇప్పటికే కీలక స్పెసిఫికేషన్లు, అంచనా ధర విషయాలు లీకయ్యాయి. 
 
జియో ఫోన్‌ 5జీ ధర రూ.12వేలలోపే ఉండే అవకాశాలు అధికం. దీంతో ఒకానొక చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌గా ఈ మొబైల్‌ ఉండనుంది. ఈఎంఐ ఆప్షన్‌ను కూడా జియో ప్రకటించే అవకాశం ఉంది. 
 
బండిల్డ్ ప్లాన్స్, డేటా ఆఫర్లు కూడా ఉండొచ్చు. ఈ ఏడాది దీపావళి సేల్‌ సందర్భంగా జియోఫోన్ 5జీ మొబైల్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. జియో కూడా ఈ ఏడాది చివరికల్లా చాలా ప్రాంతాలకు 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించాలని ప్లాన్ చేసుకున్నది.
 
జియో ఫోన్‌ 5జీ మొబైల్‌లో స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌ ఉంటుందని సమాచారం. 2జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో ఈ ఫోన్ వచ్చే అవకాశం ఉంది. 5G ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్‌గా స్నాప్‌డ్రాగన్ 480 ఉంది. తక్కువ ధరలో 5జీ మొబైల్‌ను తెచ్చేందుకు జియో దీన్ని వినియోగిస్తోందని సమాచారం. 
 
ఈ ప్రాసెసర్‌ ఎనిమిది (ఆక్టా) కోర్స్‌ను కలిగి ఉంటుంది. జియోఫోన్ నెక్స్ట్‌లో ఉండే ప్రగతిఓఎస్ Jio Phone 5Gలో ఉండనుంది. రిలయన్స్ జియో కోసం గూగుల్ ఈ కస్టమ్ ఆండ్రాయిడ్ ఓఎస్‌ను రూపొందించింది.
Jio
 
ఫీచర్స్   
6.5ఇంచుల హెచ్‌డీ+ IPS LCD డిస్‌ప్లే,
జియో ఫోన్‌ 5జీ వెనుక రెండు కెమెరాలు ఉంటాయి.
13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉండొచ్చు. 
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రానుందని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు