ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ రెండోసారి తండ్రి అయ్యాడు. ఆ పాపకు ఆగస్ట్ అనే పేరు పెట్టారు. ఆగస్టులో పుట్టిన ఆ బిడ్డకు ఆగస్ట్ అని పేరు పెట్టాడని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం జుకర్ రెండో పాపకు తొలి బిడ్డకు రాసినట్టే ఉత్తరం రాశాడు. "డియర్ ఆగస్ట్.. ఈ ప్రపంచంలోకి నీకు స్వాగతం. నీ రాక కోసం మీ అమ్మా, నేను ఎంతో ఆత్రుగా ఎదురు చూశామని చెప్పారు.
ఇక మీ అక్క మాక్స్ పుట్టినప్పుడు కూడా మేం ఇంతే ఆనందంగా ఉన్నాం. అప్పుడు కూడా ఇలానే ఉత్తరం రాశాం. నువ్వు విద్య, బలమైన అనుబంధాలు, సమానత్వం ఉన్న ప్రపంచంలో పెరగాలని ఆశిస్తున్నాం. బాల్యదశను బాగా ఎంజాయ్ చెయ్. మీ ఇద్దరి భవిష్యత్తు తల్లిదండ్రులుగా మేం చూసుకుంటాం.
ఇంకా ఆ లేఖలో.. నువ్వు మ్యాక్స్‌తో కలిసి పుస్తకాలు చదవాలి. ఇంట్లో ఆడుకోవాలి. నువ్వు చాలాసేపు నిద్రపోతావనుకుంటా. నీ కలలో మేమొస్తామని నమ్ముతున్నా. నీ భవిష్యత్తే కాదు.. నీ తరం చిన్నారులకు అత్యుత్తమ ప్రపంచాన్ని సృష్టిస్తాం. నీ జీవితం సంతోషకరంగా మారేందుకు నా అభినందనలు. నీవిచ్చిన సంతోషాన్ని మేము నీకు తిరిగిస్తామని జుకర్ బర్గ్ ఆ లేఖలో రాశారు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.