ఆ ఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు

సోమవారం, 1 నవంబరు 2021 (12:51 IST)
నవంబరు ఒకటో తేదీ నుంచి అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా, అనేక నిబంధనలు, ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఇందులోభాగంగా, అనేక రకాలైన మొబైల్‌లలో వాట్సాప్‌ నిలిచిపోనుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటి పాత వెర్షన్‌లకు సపోర్ట్ చేయదని వాట్సాప్ వెల్లడించింది. 
 
మెసేజింగ్ యాప్‌ని Android OS 4.1, అంతకంటే ఎక్కువ, iOS 10 , అంతకంటే ఎక్కువ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే ఉపయోగించవచ్చు. వీటిలో శాంసంగ్‌ గెలక్సీ, గెలక్సీ ట్రెండ్‌ లైట్‌, గెలక్సీ SII, గెలక్సీ ట్రెండ్‌ II, గెలక్సీ S3 Mini, గెలక్సీ Core, గెలక్సీ Xcover 2 వంటివి ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు