భారత్‌లో 5జీ కనెక్టివిటీకి ఇంకా టైముంది.. కానీ వన్ ప్లస్ ఆ పనిని?

సోమవారం, 9 డిశెంబరు 2019 (18:30 IST)
భారతీయ టెలికమ్యూనికేషన్ పరిశ్రమ 5జీ కనెక్టివిటీని ప్రారంభించేందుకు ఇంకా కసరత్తులు మాత్రమే చేస్తోంది. స్పెక్ట్రమ్ వేలం ఇంకా ప్రభుత్వం నిర్వహించాల్సి వుంది. ఇతర మౌలిక సదుపాయాలపై కూడా ఎలాంటి చొరవ తీసుకోలేదు. స్వీడన్ సంస్థ ఎరిక్సన్ 2022 నాటికి మాత్రమే 5జీ సేవలను భారత్‌కు అందుబాటులోకి వుంటుందని భావిస్తోంది. 
 
కానీ వన్‌ప్లస్ సంస్థ భారతదేశాన్ని 5జీలో ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు కలిగి ఉంది. దాని మొబైల్ హ్యాండ్‌సెట్‌లను ఉత్తర అమెరికా వంటి సుదూర మార్కెట్లకు కూడా ఎగుమతి చేస్తోంది. ఇందులో భాగంగా 5జీ పరికరాల తయారీ నోయిడాలో జరుగుతోంది. భారత్ నుంచి హ్యాండ్ సెట్లను ఇతర దేశాలకు వన్ ప్లస్ ఎగుమతి చేస్తోంది. 
 
ఒప్పోతో పాటుగా వన్‌ప్లస్ ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. బ్రాండ్ల మధ్య ఇప్పటికే పరస్పర ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే చైనా, దక్షిణ కొరియాలు 5జీ సేవల కోసం శరవేగంగా దూసుకెళ్తున్నాయి. 
 
చైనాలో, నాలుగు సర్వీసు ప్రొవైడర్లు 5జి సేవ కోసం తమ ప్రీ-ఆర్డర్ రిజిస్టర్లను తెరిచినప్పుడు, లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. సంవత్సరం ముగిసేలోపు 13 మిలియన్ 5జి కనెక్షన్లు ఉండాలని ఆ దేశం భావిస్తోంది.
 
అయితే భారత్‌లో ఈ సేవల కోసం మరో రెండు మూడు సంవత్సరాలు వేచి చూడాల్సి వుంది. కానీ మొబైల్ హ్యాండ్‌సెట్‌లను మాత్రం నోయిడాలో ఉత్పత్తి చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు