గూగుల్‌ పోటీగా కొత్త సెచ్ర్ ఇంజిన్.. చాట్ జీపీటీ సృష్టి

వరుణ్

శుక్రవారం, 26 జులై 2024 (16:42 IST)
ప్రస్తుతం ఇంటర్నెట్ సెర్చింజిన్ దగ్గజ కంపెనీగా గూగుల్ కొనసాగుతుంది. దీనికి పోటీగా చాట్ జీపీటీ కొత్తగా ఓ సెర్చింజిన్‌ను తయారు చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సాయంతో ఈ టెక్ ఇంజిన్‌‍ను సృష్టిస్తుంది. తద్వారా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కు ఓ సవాల్ ఎదురుకానుంది. ఈ కొత్త సెర్చ్ ఇంజిన్‌కు సెర్చ్ జీపీటీ అని పేరు పెట్టారు. సెర్చ్ ఇంజిన్ రంగంలో తిరుగులేని స్థానాన్ని ఆక్రమించిన గూగుల్‌ను సవాల్ చేస్తూ ఓపెన్ ఏఐ ఈ నూతన సెర్చ్ ఇంజిన్‌ను ప్రకటించింది. 
 
ప్రస్తుతానికి సెర్చ్ జీపీటీ అభివృద్ధి దశలో ఉంది. పరిమితస్థాయిలో యూజర్లతోనూ, పబ్లిషర్లతోనూ దీనిని పరీక్షిస్తున్నారు. సెర్చ్ జీపీటీ సాయంతో రియల్ టైమ్ డేటా యూజర్ల ముందు ప్రత్యక్షమవుతుందని ఓపెన్ ఏఐ చెబుతుంది. సెర్చ్ జీపీటీలో ఏదైనా అంశం గురించి టైప్ చేస్తే దానికి సంబంధించిన సమాచారంతో పాటు ఆ కంటెంట్ మూలాధారమైన వనరుల లింకు‌లు కూడూ స్క్రీన్‌పై దర్శనమిస్తాయి. యూజర్ల నుంచి వచ్చే అనుబంధ ప్రశ్నలకు కూడా సెర్చ్ జీపీటీ సమాధానమిస్తుంది. అలాంటి అత్యాధునిక సెర్చ్ ఇంజిన్‌ను చాట్ జీపీటీ తయారు చేస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు