దేశీయ టెలికాం రంగంలో తన సేవలు ప్రారంభించిన తర్వాత జియో యూజర్లు ఇప్పటివరకు 378 కోట్ల జీబీల ఇంటర్నెట్‌ను వాడారట. ఇందులో 178 కోట్ల గంటలు వీడియో చూశారు. జియో కంపెనీ వచ్చిన తర్వాత రిలయన్స్ ఇప్పటివరకు 271 కోట్ల రూపాయల నష్టాన్ని మూటగట్టుకుంది. ప్రారంభంలో ఉచిత ఆఫర్ ఇచ్చింది. దీనికిగాను ఇన్ని కోట్లు నష్టపోయినట్లు ఆయన ప్రకటించారు.
ఇక జియో కస్టమర్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13.86 కోట్లకు చేరారు. మొత్తం ఆదాయం రూ.6,147 కోట్లుగా ఉంది. ఇందులో నికర నష్టం రూ.270 కోట్లుగా తేలింది. ఇందులో పన్నులు, వడ్డీల చెల్లింపులు రూ.10 కోట్లుగా ఉంది. మార్కెట్‌లోకి ప్రవేశించిన తర్వాత పోటీని తట్టుకుని నిలబడేందుకు ఫ్రీ ఆఫర్స్, ఉచిత్ డేటాతోపాటు బోలెడు ఆఫర్స్ ప్రకటిస్తూ వచ్చిన విషయం తెల్సిందే.