దేశంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న రిలయన్స్ జియో మరో ఆకర్షణీయమైన ప్లాన్‌తో ముందుకువచ్చింది. జియో మాస్ ప్లాన్ పేరుతో దీన్ని ప్రకటించింది. ఈ ప్లాన్ కింద రూ.98కే ఉచిత కాలింగ్ సౌకర్యంతో పాటు నెలకు 2జీడీ డేటాను ఇవ్వనుంది. ఈ ప్లాన్ కాలపరిమితి 28 రోజులు. మరింత మంది కస్టమర్లను సంపాదించేందుకు రిలయన్స్ జియో ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది.
ఈ ప్రాన్ ప్రకటించిన తర్వాత భారతీ ఎయిర్‌టెల్ షేరు విలువ 6.51 శాతం, ఐడియా కంపెనీ షేరు విలువ రూ.5.38 శాతం మేరకు పడిపోయింది. ఈ ప్లాన్‌పై టెక్ నిపుణులు స్పందిస్తూ, జియో మాస్ ప్లాన్ వల్ల సగటున ఓ యూజర్ నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ) మరింత తగ్గుతుందని జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది. జియో 98 ప్లాన్ అర్థవంతమైన ప్లాన్ అని క్రెడిట్ సూసే పేర్కొంది. దీనివల్ల పోటీ సంస్థలకు మరిన్ని నష్టాలు, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని అంచనా వేసింది.