ప్రపంచ వ్యాప్తంగా 4జీ డేటా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2జీ, 3జీ కనుమరుగై.. ప్రస్తుతం 4జీ డేటా వాడుకలో వచ్చేసింది. ఇందుకు తోడు స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడంతో 4జీకి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ డేటా చాలనట్లు ప్రస్తుతం 5జీ డేటా అందుబాటులోకి రానుంది. 2020లో 5జీ డేటా భారత్‌లోకి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని టాక్ వస్తోంది.
5జీ ఎయిర్‌వేవ్స్ ద్వారా కాల్స్, డెక్ట్స్ సందేశాల డేటాను సులభంగా కాజేస్తారని, 5జీ ఎయిర్‌వేవ్స్ ద్వారా డేటా స్పైయింగ్ అవుతుందని.. బెర్లిన్ టెక్నికల్ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. 5జీ నెట్‌వర్క్‌తో ప్రైవసీకి విఘాతం కలుగుతుందని.. స్మార్ట్ ఫోన్ల నుంచి డేటాను సులభంగా దోచుకునేందుకు ఈ నెట్‌వర్క్ సులభంగా వుంటుందని పరిశోధనలో వెల్లడి అయ్యింది.
డేటా చోదకులు, హ్యాకర్లకు 5జీ ఎయిర్‌వేవ్స్ ఎంతగానో సహకరిస్తాయని పరిశోధకులు తెలిపారు. 5G భద్రతతో వైరుధ్యం వుందని, ఇది ఇంటర్నేషనల్ మొబైల్ సబ్‌స్క్రైబర్ ఐడెంటికి లేదా ఐఎమ్ఎస్ఐ క్యాచర్లకు వ్యతిరేకంగా వుంటుందని.. 5జీ డేటా ఫోన్లలో గూఢచర్యం చేసేందుకు సెల్ టవర్ల వలె వ్యవహరిస్తుందని.. పరిశోధకులు తేల్చారు.