యూటీఎస్ మొబైల్ యాప్-జనరల్, ఫ్లాట్‌ఫామ్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు..

గురువారం, 12 జులై 2018 (18:30 IST)
యూటీఎస్ ఆన్‌లైన్ మొబైల్ యాప్ వచ్చేసింది. రిజర్వేషన్ లేని జనరల్ టిక్కెట్లను ఇకపై స్మార్ట్‌ఫోన్ల నుంచి క్షణాల్లో తీసుకునే అవకాశాన్ని కల్పించే దిశగా దక్షిణ మధ్య రైల్వే యాప్‌ను రూపొందించింది. ఈ యూటీఎస్ ఆన్‌లైన్ మొబైల్ యాప్ సేవలు ఈ నెల 15వ తేదీ అర్థరాత్రి నుంచి అందుబాటులోకి రానున్నాయి.
 
ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌ కుమార్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లు లేని సాధారణ ప్రయాణికుల కోసం ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. డిజిటల్‌ టెక్నాలజీ వినియోగంలో ద.మ.రైల్వే ముందుందన్నారు. సికింద్రాబాద్‌ పరిధిలోని సేవలకు డిజిటల్‌ పేమెంట్‌ మోడ్‌లో చేసేలా ప్రోత్సహిస్తామన్నారు. 
 
దక్షిణ మధ్య రైల్వేలోని పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్ల పరిధిలో ఈ యాప్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ యాప్‌ద్వారా టికెట్లు బుక్‌ చేసుకొనే సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ప్లాట్‌ఫాం టికెట్లను కూడా యూటీఎస్‌ యాప్‌ద్వారా బుక్‌ చేసుకోవచ్చని వినోద్ స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు