వాట్సాప్ ప్రైవసీ పాలసీ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ పాలసీ వ్యవహారాన్ని మే వరకు వాట్సాప్ పక్కనబెట్టింది. అయితే వాట్సాప్‌తో కొత్త కొత్త తంటాలు తప్పట్లేదు. వాట్సాప్‌లో నిత్యం ఏదో ఒక మెసేజి, లింకు షేర్ చేస్తూనే ఉంటారు మోసగాళ్లు. అందులో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్ ఒకటుంది. వాట్సాప్ డైరెక్టర్ వరుణ్ పుల్యాని పేరుతో ఓ వైరల్ మెసేజ్ చక్కర్లు కొడుతుంది.
ఈ మెసేజ్‌లో ఏముందంటే..? తాము 19 బిలియన్ డాలర్లకు మార్క్ జుకర్‌బర్గ్‌కు వాట్సాప్‌ను విక్రయించాము. ఇప్పుడు ఈ యాప్ ఫేస్ బుక్ నియంత్రణలో ఉంది. ఈ మెసేజ్ 20 మందికి షేర్ చేస్తే మీ వాట్సాప్ లోగో 24 గంటల్లో ఫేస్‌బుక్ "ఎఫ్"తో కొత్త చిహ్నంగా మారడంతో పాటు నీలం రంగులోకి మారుతుంది" అంటూ వాట్సాప్ యూజర్లకు షేర్ చేస్తున్నారు.
ఈ లీమెసేజిలు, వాటితో పాటుగా వచ్చే లింకులు చాలా ప్రమాదమని మీ వ్యక్తిగత డేటా మొత్తం హ్యాకర్ల చేతికి చిక్కుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు వరుణ్ పుల్యాని పేరుతో తమ సంస్థలో ఏ డైరెక్టర్ లేరని, వాట్సాప్ తమ యూజర్లకు ఏదైనా సమాచారం ఇవ్వాల్సి వస్తే సొంత బ్లాగ్ ద్వారా తెలుపుతుంది. ఈ నకిలీ సందేశాల పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సంస్థ కోరుతుంది.