భారత మార్కెట్లోకి వివో నుంచి సరికొత్త మోడల్స్.. ధర: రూ. 29,990

మంగళవారం, 1 డిశెంబరు 2020 (22:18 IST)
Vivo V20 Pro
వివో నుంచి సరికొత్త మోడళ్లలో స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తేనుంది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో భారత మార్కెట్‌లో డిసెంబర్ 2వ తేదీన వివో వి20 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఆన్‌లైన్ ద్వారా వినియోగదారులు ఫోన్లను ప్రీ-బుక్ చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. అయితే ముందస్తుగా ఫోన్ల కోసం కస్టమర్లు రూ.2000 చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది.
 
అయితే వివో వి20 స్మార్ట్‌ఫోన్‌ విడుదలకు ముందే విక్రయ సంస్థ ఫోన్ల ధరలను వెల్లడించాయి. రిలయన్స్ డిజిటల్, పూర్వికా మొబైల్, సంగీత మొబైల్స్ వెబ్‌సైట్లు రూ. 29,990 ఉండొచ్చని అంచనా వేశాయి. భారత్‌లో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ రూ. 29,990 ఉంటుందని అంచనా వేశాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు