పని చేయని 18.05 లక్షల వాట్సాప్ ఖాతాలు

మంగళవారం, 3 మే 2022 (13:59 IST)
యూజర్లు నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ ఏకంగా 18.05 లక్షల వాట్సాప్ ఖాతాల పని చేయడం నిలిపివేసింది. ఈ మెజేసింగ్ ఫ్లాట్‌ఫాం ప్రచురించిన నెలవారీ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. 
 
ఈ నేపథ్యంలో వాట్సాప్ యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు 18.05 లక్షల వాట్సాప్ ఖాతాల పనితీరును నిలిపివేసినట్టు పేర్కొంది. ఈ ఖాతాలు చట్ట నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించింది. ఈ చర్యలు కూడా గత యేడాది నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ చట్టం మేరకు చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొంది. 
 
ఆ చట్టం ప్రకారం డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లన్నీ ఐటీ చట్టాల పరిధిలోకి వస్తాయని తెలిపింది. అందువల్ల నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను, మార్చి ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు 18 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించి, తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు