వాట్సాప్ అకౌంట్లపై సైబర్ అటాక్.. ఎలా జరిగిందో తెలుసా?

శుక్రవారం, 1 నవంబరు 2019 (14:29 IST)
వాట్సాప్ అకౌంట్లపై సైబర్ అటాక్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 20దేశాల్లోని హైప్రొఫైల్ అధికారులే లక్ష్యంగా సైబర్ దాడికి ప్రయత్నించినట్టు వాట్సాప్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. అమెరికా సంయుక్త దేశాలకు సంబంధించిన సీనియర్ ప్రభుత్వ అధికారుల ఫోన్ నెంబర్లను లక్ష్యంగా చేసుకుని హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్‌తో నిఘా పెట్టినట్టు సంస్థ గుర్తించింది.
 
వాట్సాప్ సంస్థ ప్రత్యేకించి జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. ఇజ్రాయేల్‌కు చెందిన ఎన్ఎస్ఓ అనే గ్రూపు స్పైవేర్ సాఫ్ట్‌వేర్ టూల్ సాయంతో హైప్రొఫైల్ ప్రభుత్వ అధికారుల వాట్సాప్ అకౌంట్లపై రహస్యంగా నిఘా పెట్టినట్టు వాట్సాప్ ట్రేస్ చేసింది.

మొత్తం 20 దేశాల్లో హై ప్రొఫెల్స్ వున్న ప్రభుత్వ అధికారులు, ఆర్మీ అధికారుల అకౌంట్లను హ్యాకింగ్ చేసి డేటా ఉల్లంఘనకు పాల్పడినట్లు వాట్సాప్ అంతర్గత విచారణలో వెల్లడి అయ్యింది. 
 
ఏప్రిల్ 29, 2019 నుంచి మే 10, 2019 మధ్యకాలంలో వాట్సాప్ యూజర్ల సెల్ ఫోన్ నెంబర్లను వాట్సాప్ సొంత సర్వర్ల నుంచి కనీసం 1,400 మంది యూజర్ల అకౌంట్లను హ్యాకింగ్ చేసి డేటా ఉల్లంఘనకు పాల్పడినందుకు సదరు సంస్థపై యూఎస్ ఫెడరల్ కోర్టులో వాట్సాప్ దావా వేసినట్టు పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు