స్క్రీన్ పగిలిన ఫోన్లను అలాగే వాడేస్తున్నారా? పేలిపోతాయ్ జాగ్రత్త!

సోమవారం, 13 సెప్టెంబరు 2021 (14:54 IST)
విమానంలో ఫోన్‌ పేలిపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండ్‌ కావడం, అంతకు ముందు ఛార్జింగ్‌ పెట్టి ఫోన్‌ మాట్లాడిన యువతి దుర్మరణం.. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అందుకే ఫోన్ వాడకంలో అప్రమత్తత అవసరం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.. ఫోన్ పాడైన వెంటనే దాన్ని రిపేర్‌ చేయించాలి. అంతేకాదు స్క్రీన్ గార్డ్‌కు క్రాక్స్‌ వచ్చినా వెంటనే మార్చేయడం ఉత్తమం. 
 
కరోనా వల్ల ఈమధ్య శానిటైజర్‌లను ఫోన్లకు సైతం వాడేస్తున్నారు కొందరు. అయితే ఛార్జింగ్‌ సాకెట్‌ల ద్వారా లిక్విడ్‌ లోపలికి వెళ్లి.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి టిష్యూస్‌తో అదీ జాగ్రత్తగా తుడవడం బెటర్‌ అని సూచిస్తున్నారు. 
 
చాలామంది స్క్రీన్ పగిలిన ఫోన్లను అలాగే వాడేస్తుంటారు. రిపేరింగ్‌కు బద్ధకిస్తుంటారు. ఇలా ఫోన్లను ఉపయోగించకపోవడమే మంచిదంటున్నారు టెక్ నిపుణులు. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ.. ఫోన్లలో చాలా వరకూ వీటితోనే నడుస్తున్నాయి. బ్యాటరీలు, ఛార్జింగ్ వైర్లు, అడాప్టర్లను స్పెషల్‌ టెక్నాలజీతో తయారు చేస్తున్నాయి కంపెనీలు. 
 
సూర్యరశ్మి తగిలే చోటులో ఫోన్‌ వేడెక్కడం సహజం. అలా సూర్యరశ్మి పడే చోట ఛార్జింగ్‌ పెట్టడం మంచిది కాదు.
ఫోన్‌పై అదనంగా ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఛార్జ్‌ చేసేప్పుడు ఫోన్‌పై ఎలాంటి వస్తువులు ఉంచకపోవడం ఉత్తమం.
ఛార్జింగ్‌ టైంలో ఫోన్ వేడెక్కుతున్నట్లు గమనిస్తే వెంటనే అన్‌ఫ్లగ్‌ చేయాలి.
 
వర్షాలు పడుతున్న టైంలో ఛార్జింగ్‌ పెట్టి ఫోన్‌లు ఉపయోగించడం అస్సలు మంచిది కాదు.
ఫోన్‌ వేడెక్కినట్లు అనిపిస్తే.. సర్వీస్‌ సెంటర్‌ తీసుకెళ్లి చెక్ చేయించాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు