దీపావళి పండుగ ఆన్‌లైన్ సంస్థలకు మంచి వ్యాపారం అందించింది. ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునే దిశగా భారీ ఆఫర్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో షియోమీతో పాటు పలు బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లకు ఆఫర్లు వెల్లువెత్తాయి. దీపావళి పండగ సీజన్‌లో దేశవ్యాప్తంగా నాలుగు మిలియన్లకు పైగా షియోమి స్మార్ట్‌ఫోన్లు అమ్ముడుపోయాయని సంస్థ తెలిపింది.
ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ అమ్మకాల్లో షియోమీ బ్రాండ్ నెంబర్ వన్‌గా నిలిచిందని షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ తెలిపారు. దీనికి సంబంధించి ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 19 వరకు దివాలీ సేల్స్ పీరియడ్‌లో అమ్మకాలు జోరందుకున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే, అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌లతో పాటు ఇతర స్టోర్ల ద్వారా నాలుగు మిలియన్ల షియోమి ఫోన్లు అమ్ముడుపోయాయని మను కుమార్ చెప్పుకొచ్చారు. ఈ ఘనత సాధించిన ఏకైక స్మార్ట్‌ఫోన్ కంపెనీ తమదేనని.. ఈ సందర్భంగా ఎమ్ఐ ఫ్యాన్సుకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఈ పోస్ట్‌ను షేర్ చేయండి... ఎమ్ఐ ఏ1 ఫోన్ గెలుచుకోండని జైన్ పోస్ట్ తెలిపారు.