అమేజాన్, ఫ్లిఫ్ కార్ట్‌లకు షాక్ తప్పదా? యూట్యూబ్ షాపింగ్ సైట్..?

సోమవారం, 12 అక్టోబరు 2020 (15:14 IST)
గూగుల్ మరో కొత్త ట్రెండ్ తీసుకురాబోతోంది. ఇప్పటివరకు యూట్యూబ్‌లో వీడియోలు మాత్రమే చూస్తున్నాం. త్వరలో వీడియో చూస్తూనే మనకు కావలసిన వస్తువును అక్కడినుంచే ఆర్డర్ చేసి నేరుగా ఇంటికి రప్పించుకునే అవకాశాన్ని కల్పించబోతోంది గూగుల్. అంటే ఫ్లిఫ్ కార్టులతో ఎలాగైతే కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తున్నామో అదేవిధంగా ఇకపై యూట్యూబ్ నుంచి కూడా వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కల్పించబోతున్నారు.
 
ప్రజల అవసరాలు ఎలా ఉంటాయో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటికి అనుగుణంగా తన వ్యాపారాన్ని విస్తరించుకునే గూగుల్ ఇప్పుడు ఈ-కామర్స్ రంగంలోకి దూసుకురాబోతోంది. ఇప్పటికే పలు నివేదికలు చెప్తున్న దాని ప్రకారం త్వరలోనే యూట్యూబ్ నుంచి కొనుగోళ్లు జరిపే అవకాశం ఉంది. ఈ మేరకు యూట్యూబ్ యాప్‌లో మార్పులు చేసేందుకు డెవలపర్లు ప్రయత్నాలు ప్రారంభించారు.
 
ఇప్పటికే ప్రపంచంలో అతి పెద్ద వీడియో హబ్ అయిన యూట్యూబ్ ఇకపై షాపింగ్ హబ్‌గా మారిపోనుంది. ఒక వీడియో చూస్తున్నపుడు అందులో మనకు నచ్చిన వస్తువును అక్కడి నుంచే నేరుగా కొనుగోలు చేసేలా గూగుల్ యూట్యూబ్ షాపింగ్ హబ్‌ను సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. 
 
ఈ పద్ధతిలో కనుక యూట్యూబ్ షాపింగ్ సైట్ తయారైతే, ఇప్పుడు ఈ కామర్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న అమేజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇవ్వడం ఖయామని నిపుణులు భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు