ఆడపడుచు రోజాను ఎన్నిసార్లు శిక్షిస్తారు? వెనకేసుకొచ్చిన అన్నయ్య జగన్

బుధవారం, 8 మార్చి 2017 (07:03 IST)
ఏదైనా కేసులో జీవితౖ ఖెదు విధించిన వారికి కూడా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని శిక్షాకాలాన్ని తగ్గిస్తారని, అలాంటిది ఏడాది పాటు సస్పెన్షన్‌ కాలం పూర్తయిన తరువాత కూడా తమ శాసన సభ్యురాలు రోజాను మళ్లీ శిక్షిస్తామనడం ఎక్కడైనా ఉందా అని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీ వాయిదా పడిన తరువాత లాబీల్లో విలేకరులు ‘రోజాను మళ్లీ సస్పెండ్‌ చేయాలని అధికారపక్షం అంటోది... కదా!’ అని జగన్‌ వద్ద ప్రస్తావించినపుడు  ‘ఆమెను ఇప్పటికే ఒక ఏడాది పాటు సస్పెండ్‌ చేసి సభకు రాకుండా చేశారు.  ఏడాది శిక్షాకాలం పూర్తయి కూడా ఆరు నెలలు దాటింది కూడా... మళ్లీ ఇపుడు కొత్త దానికి శిక్ష అంటున్నారు. ఇలా ఎన్నిసార్లు శిక్షి స్తారు... ఒక ఆడపడుచును, మహిళా ఎమ్మెల్యేను ఇలా శిక్షించాలని చూడ్డం ధర్మమేనా’ అని జగన్‌ వ్యాఖ్యానించారు.
 
కాల్‌మనీ సెక్స్‌ కుంభకోణంపై ఆరోజు సభలో తామంతా మాట్లాడామని, రోజా చివర్లో మాట్లాడారని జగన్‌ అన్నారు. రెండు హత్యలకు శిక్ష వేసినపుడు ఆ శిక్షా కాలం పూర్తయిన తరువాత, మళ్లీ రెండో హత్యకు కూడా శిక్ష అనుభవించాలని అన్నట్లుగా ఉందని జగన్‌ అన్నారు. ఏదైనా కేసులో జీవితౖ ఖెదు విధించిన వారికి కూడా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని శిక్షాకాలాన్ని తగ్గిస్తారని, అలాంటిది ఏడాది పాటు సస్పెన్షన్‌ కాలం పూర్తయిన తరువాత మళ్లీ శిక్షిస్తామనడం ఎక్కడైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. అధికారపక్షం చూపిస్తున్న వీడియోలు తప్పని, అవి ఒరిజినల్‌ కావని రోజా చెబుతున్నా ఆ విషయంలో ఎందుకు స్పందించడం లేదని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. 
 

వెబ్దునియా పై చదవండి