చిన్నపిల్లలు స్పర్శ ద్వారానే ప్రేమను ఆస్వాదిస్తారు!

FILE
ఎక్కువమంది చిన్నపిల్లలు స్పర్శ ద్వారా ప్రేమను అనుభవిస్తారు. అది వారి మౌలికమైన కోరిక. పెద్దవాళ్ళయ్యాక అలా తండ్రితోగానీ, తల్లితోగానీ వుండేందుకు సిగ్గు పడవచ్చు. అందుచేత పిల్లలు స్పర్శ ద్వారానే తల్లిదండ్రులను, ఇతరులను గుర్తిస్తారని నిపుణులు అంటున్నారు.

1. గుండెలకు హత్తుకున్నా, ముద్దులాడినా లేదా పరస్పర గిలిగింతలకు పిల్లలు ఇష్టపడతారు
2. అనవసరంగా కొట్టడం, తిట్టడం వంటి పనుల వలన పిల్లలు నొచ్చుకుంటారు.

3. తల్లిదండ్రుల మీద ప్రేమగా పడుకోవడానికి లేదా వారిని హత్తుకోవడానికి పిల్లలు ఇష్టపడతారు.
4. పిల్లలను హత్తుకునేందుకు, ముద్దాడేందుకు, పక్కనే పడుకుని నిద్రించడానికి గల అవకాశాలన్నీ చక్కగా వినియోగించాలి.

వెబ్దునియా పై చదవండి