నేలమీద చిన్న చిన్న వస్తువులు, రాళ్లు, పూసలు, దుస్తుల మీద కుట్టే అద్దాల వంటివి ఉండకుండా చూసుకోవాలి. ఇవి వుంటే పిల్లలు నోట్లో పెట్టుకునే ప్రమాదం ఉంది. సబ్బులు, పేస్టులు, రసాయనాలు చేతికందే విధంగా పెట్టకుండా చూసుకోవాలి.
బాత్రూమ్ తలుపులు మూసివుంచాలి. మాత్రలు ఎత్తులో పెట్టాలి. వంటగదిలో చాకులూ, వేడి పాత్రలూ కింద పెట్టకూడదు. కరెంట్ తీగలు వేలాడకుండా చూసుకోవాలి. మొనతేలిన టీపాయ్లూ, బల్లలూ ఉంటే తీసేయాలి.