పసిపాపల ఆలనాపాలనాలో నాన్నలు కూడా..?

సోమవారం, 20 ఏప్రియల్ 2015 (17:58 IST)
పిల్లల్ని పెంచడం కొంచెం కష్టమైన పనే. దీనికి కొంచెం ఓపిక కావాలి. నిజానికి ఇది ఆడవాళ్ల వలనే అవుతుంది. అయితే ప్రస్తుతం న్యూక్లియర్ ఫ్యామిలీలు ఎక్కువ కావడం వల్ల  మగవాళ్లు కూడా పిల్లల ఆలనా పాలనలో పాలుపంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మగవాళ్ళు కూడా పిల్లల కోసం అన్నీ పనులు చేయగలరు. దీనికి కొంచెం తర్ఫీదు, మార్గదర్శన అవసరం. 
 
కొత్త తరం అమ్మలవలె కొత్త తరం నాన్నలకు కూడా నవజాత శిశువుల ఆలనాపాలనా గురించి తెలీదు. శిశుపెంపకాలకు సంబంధించిన చిట్కాలతో వాళ్ళకి పెద్దగా పరిచయం వుండదు. కాబట్టి నాన్నలే ముందుగా కార్యరంగంలోనికి దిగిపోవడం ఉత్తమం. ఏం చేయాలో ఎలా చూడాలో మగవాళ్లు కూడా నేర్చుకోవాలి. 
 
పసిపిల్లల ఆలనాపాలనలో డైపర్లు మార్చడం, స్నానం చేయించడం, ముస్తాబు చేయడం వంటి ప్రాథమిక పనులకు నాన్నలను దూరంగా వుంచరాదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. పిల్లల పెంపకంలో పురుషులు పాలుపంచుకోవడం ద్వారా భాగస్వామిని ఒత్తిడిని నుంచి ఉపశమనం కలిగించినవారవుతారని చైల్డ్ కేర్ నిపుణులు చెబుతున్నారు 

వెబ్దునియా పై చదవండి