చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను మిగతా పిల్లలతో పోలుస్తూ ఉంటారు. ఈ కారణంగానే వారు ఒత్తిడికి గురవుతున్నారు. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదంటున్నారు. వారు బాగా చదివేలా, ఆడేలా ప్రోత్సహించాలి. అలానే ఫలితాలపై దృష్టి పెట్టకుండా చేసే పనిలో వారు ఆనందం పొందేలా చూడాలి.
పిల్లలు బాధపడుతున్నా, మీ దగ్గర కొన్ని విషయాలు దాస్తున్నా, మీతో వారి విషయాలు చెప్పకపోయినా.. వీటన్నింటికి ఒకే కారణం. ఈ విషయాలన్నీ మీకు చెబితే మీరు తిడతారనీ, కోప్పడతారనీ మీతో చెప్పరు. ఆ సమయంలో మీరు కట్టుబాట్లను కాస్త సడలించి వారికి కూసింత స్వేచ్ఛనిస్తే వారూ హాయిగా వూపిరి పీల్చుకుంటారు.