చేమదుంపలో ఏముందో తెలుసుకోవాలా.. అయితే ఈ కథనం చదవండి. చేమదుంపలో ఎ విటమిన్, బి1 (థయామిన్), బి2 (రిబోఫ్లేవిన్), బి3 (నియాసిన్), బి5 ( పాంటోథెనిక్ యాసిడ్), బి6 (పైరిడాక్సిన్), బి9 (ఫోలేట్), సి విటమిన్, ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్ పీచు ఉంటాయి. ఇందులో కొవ్వు చాలా తక్కువ.
* చేమదుంప కలోన్ క్యాన్సర్ ను నివారిస్తుంది. దేహంలో నిల్వచేరిన చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. చర్మకణాల క్షీణతను అరికడుతుంది. చర్మవ్యాధులను నివారిస్తుంది. ఎముకల పటిష్టతకు, థైరాయిడ్ గ్రంథి పనితీరుకు దోహదం చేస్తుంది.