ఆరోగ్యకరమైన శిశువు పుట్టినప్పుడు ఎన్ని కేజీలుండాలి?

శనివారం, 24 జనవరి 2015 (15:01 IST)
ఆరోగ్యకరమైన శిశువు పుట్టినప్పుడు ఎన్ని కేజీలుండాలంటే.. 2.5 నుంచి 4 కేజీల బరువు ఉండాలని గైనకాలజిస్టులు అంటున్నారు. మనదేశంలో గరిష్ట బరువు 3.5 కేజీలు. ఐదవ నెల నిండేసరికి పిల్లలు... పుట్టిన నాటికి ఉన్న బరువుకు రెండింతలు అవుతారు. 
 
ఏడాది నిండేసరికి మూడింతలవుతారు. మొదటి నెల నుంచి మూడవ నెల వరకు సరాసరిన నెలకు 800 గ్రాముల నుంచి కేజీ వరకు బరువు పెరుగుతారు. ఏడు నుంచి పన్నెండు నెలల వరకు నెలకు 250 గ్రాముల చొప్పున పెరుగుతారు. 
 
ఏడాది దాటినప్పటి నుంచి యౌవన దశ (14-15 ఏళ్లు) వచ్చేవరకు ఏడాదికి సరాసరిన ఒకటిన్నర నుంచి రెండు కిలోల బరువు పెరుగుతారని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి