పిల్లలకు అన్నీ రుచులను చిన్ననాటి నుంచి అలవాటు చేయాలి. ఆహార పదార్థాల్లోని రుచిని, అందులోని పోషకాల గురించి పిల్లలకు చిన్ననాటి నుంచే చెప్పాలి. పిల్లలకు హోటల్ ఫుడ్‌ను అలవాటు చేయకూడదు. బర్గర్లు, పిజ్జాలు తీసుకోకపోవడం మంచిది. ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా పిల్లలను పెంచాలి. ఇంట్లో తయారు చేసే ఆహారాన్ని తీసుకునేలా అలవాటు చేయాలి. ఆహారంలో పోషకాలు, పండ్లు తీసుకునేలా అలవాటు చేయాలి.
వారంలో చేపలు, మాంసకృత్తులతో కూడిన ఆహారాన్ని పిల్లలకు అందించాలి. సాల్మన్ ఫిష్‌తో పాటు రొయ్యలతో చేసిన వంటకాలు పిల్లలకు అందించడం ద్వారా ఎముకల్లో బలం చేకూరుతుంది. అలాగే రోజుకు ఓ కోడిగుడ్డును పిల్లల డైట్‌లో చేర్చడం ద్వారా వారికి అందాల్సిన పోషకాలు అందించినట్లవుతారు. ఆమ్లెట్ల ద్వారా కోడిగుడ్డును ఇవ్వడం చేయాలి. ఆమ్లెట్లో ఉల్లితరుగు, కొత్తిమీర, మిరియాల పొడిని చేర్చాలి.
వారానికి ఓసారి లేదా రెండుసార్లు అరటిపండ్లు-తేనెను కలుపుతూ స్మూతీలు ఇవ్వాలి. నిల్వచేసిన స్నాక్స్ ఇవ్వడం కూడదు. చాలారోజుల పాటు ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వడం మానేయాలి. తాజాగా వండిన ఆహారాన్ని, స్నాక్స్‌ను పిల్లలకు ఇవ్వడం ద్వారా వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.