పిల్లలకు రోజూ ఓ స్పూన్ తేనె ఇస్తే?

గురువారం, 7 సెప్టెంబరు 2017 (10:45 IST)
ప్రతిరోజూ తేనెను టీ, కాఫీల్లో కలుపుకుని తాగడం ద్వారా ఆస్తమా వ్యాధిగ్రస్థులకు మేలు జరుగుతుంది. తేనె పంచదారకు అద్భుతమైన ప్రత్యామ్నయం. ప్రతీ రోజూ తేనె స్వీకరించడం ఎంతో మేలు చేస్తుంది. తేనె గుండెకూ, మెదడుకూ చాలా మంచిది. మెదడును చురుగ్గా వుంచుతుంది.

గోరువెచ్చని నీటితో కలిపి ప్రతీరోజూ తీసుకుంటే, తేనె రక్తప్రసార వ్యవస్థలోని ఎర్ర రక్త కణాల సంఖ్యను, రక్తంలోని హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. దీని వల్ల పాండు రోగం (అనేమియా, రక్తహీనత) సమస్యలు అదుపులో ఉంటాయి. 
 
అయితే తేనెను వండకూడదు. అలా చేస్తే అది విషపూరితంగా మారుతుంది. తేనెని గోరు వెచ్చని లేదా వెచ్చని నీటిలో కలపండి, మరిగే వేడి నీటిలో కాదు. అలాగే తేనెను ఒక సంవత్సరంలోపు పిల్లలకు ఇవ్వకూడదు.

సంవత్సరం దాటిన పిల్లలకు రోజుకో స్పూన్ చొప్పున ఇస్తే పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా జలుబు, దగ్గు వంటివి దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు