తల్లిదండ్రులు విడిపోతే.. పిల్లలకే విపరీతమైన బాధ!

మంగళవారం, 11 నవంబరు 2014 (15:20 IST)
విడిపోయిన తల్లిదండ్రులతో పిల్లలే విపరీతంగా బాధపడుతున్నారని పరిశోధనలు తేల్చాయి. వివాహమైనా... విడాకులు.. సహజీవనంతో ఒంటరిగా ఉన్న తండ్రుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పరిశోధనలు చూపిస్తున్నాయి. ఒంటిరి తండ్రుల సంఖ్య పెరగడం ద్వారా పిల్లలే విపరీతంగా మానసిక వేదనకు గురవుతున్నారని సైకాలజిస్టులు అంటున్నారు. 
 
ఒకవేళ ఒంటరి తండ్రైతే.. పిల్లల సంరక్షణ చిట్కాలు పాటించండి అవేంటంటే.. పిల్లలను తండ్రి సంరక్షిస్తున్నప్పుడు ఇది గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం. పిల్లల సమస్యను ఓపిగ్గా వినడం చాలా అవసరం. పిల్లల సమస్యను పరిష్కరించేలా వ్యవహరించండి. 
 
పిల్లలను అతిగా గారాబం, అతిరక్షణ చేయటం వలన వారిలో తిరుగుబాటు ధోరణి లేదా ఎక్కువగా మీదే ఆధారపడటం జరుగుతుంది. అందుచేత ఏవీ అతిగా ఉండకూడదు. వారి జీవితాలలో సాధ్యమయినంతవరకు పాలుపంచుకోవటానికి ప్రయత్నించండి. ఓపిక, సహనం వంటివి అలవరుచుకోండి అప్పుడే పిల్లల సంరక్షణ సులభమవుతుందని మానసిక నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి