పారెంటింగ్ టిప్స్ : టీనేజర్ల ఏకాంతాన్ని గౌరవించాలి!

మంగళవారం, 20 జనవరి 2015 (11:21 IST)
టీనేజ్ పిల్లలతో తల్లిదండ్రులు జాగ్రత్తగా మెలగాలి. ఒకే పాదులో పదిమొక్కలు తలెత్తినట్లు, కౌమారంలో పిల్లల్లో ఏకకాలంలో ఎన్నెన్నో ఆలోచనలు పుడుతుంటాయి. పలురకాల భావోద్వేగాలతో మనసు ముప్పిరిగొంటూ ఉంటుంది. అంతా కలగాపులగంగా ఏదో కంగారుగా ఉంటుంది. 
 
విభిన్నమైన అంశాల్ని ఏకకాలంలో జీర్ణించుకుని వాటి మధ్య ఒక సమన్వయం సాధించే క్రమంలో పిల్లలు సతమతమవుతూ ఉంటారు. ఇది కూడా ఒక దశలో వారిని మౌనంగా ఉండేలా చేస్తుంది. అందరికీ దూరదూరంగా జరిగేలా చేస్తుంది. అంతమాత్రానే అదేదో మానసిక కుంగుబాటుగానో, లేదా మానసిక సమస్యగానో అనుమానించాల్సిన అవసరం లేదు. పైగా ఆ స్థితిలో వారు ఎంచుకున్న మౌనాన్ని, ఏకాంత వాసాన్ని తల్లిదండ్రులు గౌరవించాలి. 
 
ఏకాంతం ఏకాగ్రతకు మార్గమైతే, మౌనం వేయి మాటలకు సమానం. నిజంగానే అది హానికారకమైతే ఆ మాట వేరు. లేదంటే ఏకాంతాన్ని మౌనాన్ని అర్థం చేసుకోవాల్సిందే. వాటి వెనకున్న దీక్షను గౌరవించాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి