రాత్రి 8 గంటలకు నిద్రపోయే పిల్లలు.. ఉదయం 6 గంటలకు లేచే పిల్లలకు తేడా ఏంటి?

సోమవారం, 15 ఆగస్టు 2016 (14:40 IST)
ప్రతి రోజూ రాత్రి 8 గంటల వరకు నిద్రించే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, ఇక ఉదయాన్నే 6గంటలకు లేచే పిల్లలు చాలా యాక్టివ్‌గా ఉన్నట్లు ఓహియో యూనివర్శిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. పిల్లలు ఆటమీద పడి రాత్రి సమయంలో నిద్రపోకుండా ఉంటారు. కొందరు పిల్లలు పెద్దల తరహాలో 10 లేదా 11 గంటల సమయంలో నిద్రపోతుంటారు. అలాంటి పిల్లలు ఒబిసిటీకి గురయ్యే అవకాశాలు ఉన్నాయని సర్వేలో వెల్లడి అయ్యింది. 
 
ఈ సర్వేలో వారు 977 మంది పిల్లలను తీసుకుని దాదాపు 3 నెలల పాటు వారిని అద్యయనం చేశారు. ఉదయం కాస్త ఆలస్యంగా అంటే 8 లేదా 9 గంటలకు లేచే పిల్లలు పని పట్ల శ్రద్ధ చూపకుండా, బద్ధకంగా వ్యవహరిస్తారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే పిల్లలు రాత్రి సమయంలో 8 గంటల్లోపు పిల్లల్ని నిద్రపుచ్చాలని, ఉదయం 6 గంటల్లోపు నిద్రలేపాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి