వేదాలకు దేవతలుంటారా? పిల్లలూ తెలుసుకోండి!

బుధవారం, 15 ఏప్రియల్ 2015 (18:39 IST)
ప్రపంచంలో ప్రతి అంశానికి అధిష్టాన దైవాలు ఉంటాయి. నదులు, పర్వతాల వంటి వాటికీ దివ్య దేహాల దేవతా రూపాలున్నాయి. అదే విధంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలకూ దేవతా రూపాలు ఉన్నాయి. 
 
ఋగ్వేద దేవత ఎవరంటే..? తెల్లని రంగుతో రెండు చేతులతో ఉంటుంది. గాడిద ముఖం గలది. అక్షరమాల ధరించి, సౌమ్య ముఖంతో, ప్రీతిని ప్రకటించే వ్యాఖ్యానం చేసే ప్రయత్నంలో ఉంటుంది. 
 
యజుర్వేద దేవత ఎవరంటే..? మేక ముఖంతో పసుపు పచ్చని రంగుతో, జపమాలను ధరించి, ఎడమచేతిలో వజ్రాయుధం పట్టుకుని ఉంటుంది. ఐశ్వర్యాన్ని శుభాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. 
 
సామవేద దేవత ఎవరంటే..? గుర్రం ముఖంతో, నీలి శరీరంతో ఉంటుంది. కుడిచేతిలో అక్షరమాల, ఎడమ చేతిలో పూర్ణకుంభాన్ని పట్టుకుని ఉంటుంది. 
 
అధర్వణవేద దేవత ఎవరంటే..? కోతిముఖంతో, తెల్లని రంగుతో ఉంటుంది. ఎడమచేతిలో జపమాల, కుడిచేతిలో పూర్ణకుంభాన్ని పట్టుకుని ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి