చలికాలం పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోండి..

మంగళవారం, 16 డిశెంబరు 2014 (18:08 IST)
చలికాలం తీవ్రమైన చలితో పాటు జలుబు, దగ్గు లాంటి అనారోగ్యాల్ని కూడా వెంట మోసుకొస్తుంది. పిల్లల విషయంలోనైతే ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉంటాయి. స్వెట్టర్లు, క్యాప్‌లు సరిగ్గా ధరించకపోవడం కూడా ఇందుకు ఓ కారణమవుతాయి. కాబట్టి ఇంట్లోఉన్నా, బయటికి వెళ్లిన పిల్లలకు ఉన్ని దుస్తులు వేయడం మాత్రం మరిచిపోకూడదు.
 
అసలే తీవ్రమైన చలి అంటే...కొందరు వాళ్ళ పిల్లలకు అడిగిన వెంటనే ఐస్ క్రీమ్‌లు, కూల్ డ్రింక్స్ వంటివి కొనిచ్చేస్తుంటారు. ఇవి తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కనీసం చలికాలం అయిపోయేంత వరకైనా పిల్లల్ని వీటి జోలికి పోకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని గమనించండి.
 
పిల్లలకు సూప్స్, స్నాక్స్, భోజనం...ఇలా అన్నీ ఇంట్లోనే వేడి వేడిగా వండిపెట్టాలి. సాధ్యమైనంత వరకూ బయటి ఆహారం తినకుండా పిల్లల్ని అదుపు చేయాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి