అందుకే తక్కువగా వచ్చాయి

శుక్రవారం, 4 ఏప్రియల్ 2008 (16:03 IST)
మాస్టార్ : ఉరేయ్ శీను అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులే వచ్చాయి కానీ సోషల్‌లో ఎందుకు తగ్గాయిరా
శీను : ఆ రోజు నా సీటు రవి వెనుక నుంచి మార్చారు సార్

గోడ కుర్చీకి పనికొస్తుంది కద
టీచర్ : ఉరేయ్ రాజేష్ ఈ కుర్చీ ఎవరిదిరా కొత్తగా ఉంది
రాజేష్ : నాదే సార్ మీరు గోడకుర్చీ వేయమన్నప్పుడు పనికొస్తుందని తీసుకువచ్చాను.

ఇన్య్సూరెన్స్ ఉంది కద
గోపీ : అమ్మా నేను కూడా నాన్నతో కలసి నీళ్లలోకి వెళ్తాను
అమ్మ : వద్దురా కన్నా లోతు ఎక్కువగా ఉంటే మునిగిపోతావు
గోపీ : మరి నాన్న వెళ్లారు కదా లోతుగా ఉండదా
అమ్మ : మరేం ఫర్వాలేదు ఆయనకు ఇన్య్సూరెన్స్ ఉందిగా

వెబ్దునియా పై చదవండి