డాడీకి వినిపించాలనే...!

సోమవారం, 6 అక్టోబరు 2014 (18:30 IST)
"ఓ మంచి దేవుడా.. నాకో మంచి సైకిలును ప్రసాదించు స్వామీ...! వినిపిస్తోందా..?" వేడుకుంటున్నాడు రవి. 
 
"అబ్బా అంత గొంతు చించుకుని అరుస్తావేంట్రా... కాస్తంత మెల్లిగా అడిగితే దేవుడికి వినపడదా..? ఏంటి" కోపగించుకుంది తల్లి
 
"దేవుడికి వినిపిస్తుంది కానీ... నాన్నకి వినిపించాలిగా మమ్మీ...!"

వెబ్దునియా పై చదవండి