తాత్పర్యం : జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవాడికి అన్నాన్ని వడ్డిస్తే... దాన్ని అతడు తినకుండా పారవేస్తాడు. అదే అన్నం ధనవంతుడికి దానం చేస్తే.. తీసుకోడు. ఎందుకంటే అతనికి ఆ అవసరం లేదు. అన్నం తినేందుకు అశక్తుడు, దానంకంటే శక్తివంతుడు... వీరిద్దరికీ చేసే దానం నిష్ర్పయోజనం. కాబట్టి... అవసరం ఉన్నచోటనే, అవసరం ఉన్నవారికే దానం చేయమని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి.