తాత్పర్యం : "భట్టరార్యులను, గురువుల పాదములను బట్టి.. నీ చిహ్నమగు నామమును నుదుట ధరించితిని. రామనామ మంత్రమును సాధించితిని. యమభటులనైనా పొమ్మంటిని. నీ పాదములపై తలపు పెట్టి పాపములను పోగొట్టుకుంటిని. ఇంతకంటే నేనేమియునూ చేయలేదు శ్రీరామా..! నన్ను రక్షింపుమ"ని ఈ పద్యం యొక్క భావం.