రోగియైనవాడు రోగి నెరుంగును రోగి నరసి చూచి రూఢిగాను రోగి కిడిన వాని రాగి బంగారౌను విశ్వదాభిరామ వినుర వేమా..!
తాత్పర్యం : ఒక రోగి మరో రోగి వ్యాధిని, బాధను అర్థం చేసుకుంటాడు. ఇక రోగాన్ని ఖచ్చితంగా కనిపెట్టగలిగిన వైద్యుడు.. రాగి భస్మం ఇచ్చినా అది స్వర్ణ భస్మంలాగా చక్కగా పనిచేస్తుంది. అంటే విశ్వాసంవల్ల సగం రోగం నయమవుతుందని ఈ పద్యం యొక్క భావం.