ఆడి తప్పువార లభిమానహీనులు గోడెడురగనివాడు కొద్దికాడు కూడి కీడు సేయు క్రూరుండు తలపోయ విశ్వదాభిరామ వినుర వేమా..!
తాత్పర్యం : మాట ఇచ్చి తప్పేవాడు సిగ్గులేనివాడు. ఇతరుల బాధను అర్థం చేసుకోనివాడు అల్పుడు. స్నేహం చేసి నమ్మించి హానిచేసేవాడు క్రూరుడని ఈ పద్యం యొక్క భావం. అంటే.. తియ్యగా మాట్లాడటమేకాదు దాంట్లో సత్యముండాలి. ఎదుటివారి బాధకు జాలి చూపించటం కాదు, అర్థం చేసుకుని సాయపడాలి. అనుబంధం నటించి హానిచెయ్యటం కాదు, దానిని నిర్మలంగా కొనసాగించాలని ఈ పద్యంలో చెప్పాడు వేమన.