రారమ్మని పిలువని...!

గురువారం, 25 సెప్టెంబరు 2008 (13:29 IST)
WD PhotoWD
'రా, పొ'మ్మని పిలువని యా
భూపాలునిగొల్వ భుక్తి ముక్తులు గలపే?
దీపంబు లేని యింటను
జే పుణికిళ్ళాడినట్లు సిద్ధము సుమతీ...!

తాత్పర్యం :
దీపంలేని ఇంటిలో చేతిపట్టు కోసం పాకులాడితే... దొరకని విధంగానే, "రమ్ము పొమ్ము" అంటూ ఆదరించని రాజును సేవించటం వల్ల ఎలాంటి భుక్తి, ముక్తి దొరకవని ఈ పద్యం ద్వారా చెప్పాడు సుమతీ శతకకారుడు.

వెబ్దునియా పై చదవండి