లోభివాని నడుగ లాభంబు లేదయా..!!

FILE
గొడ్డుటావు బితుక గుండగొంపోయిన
పండ్లురాల దన్ను బాలవిదు
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ వినుర వేమా..!!

తాత్పర్యం :
ఒట్టిపోయిన ఆవు దగ్గరికి వెళ్లి పాలను పితకాలనుకోవటం మూర్ఖత్వం. ఒకవేళ అలా ప్రయత్నించినా ఎంత పితికినా పాలు రాకపోగా, ఆ ఆవు తన్నిందంటే పళ్లు రాలిపోవటం ఖాయం. అలాగే పిసినారి దగ్గరికి వెళ్లి సహాయం చేయమని అడగటం కూడా ఇలాంటి కోవలోకే వస్తుంది. కాబట్టి ఈ రెండు పనులను చేయకపోవటం మంచిదని ఈ పద్యం ద్వారా హెచ్చరించాడు వేమన మహాకవి.

వెబ్దునియా పై చదవండి