పిల్లలను నిద్రపుచ్చాలంటే.. టైమింగ్ తప్పనిసరి.. ఆకలితో మంచం ఎక్కనివ్వకూడదు

శనివారం, 16 ఏప్రియల్ 2016 (16:58 IST)
చిన్నపిల్లలకు నిద్ర చాలా ముఖ్యం. హార్మోన్ల పెరుగుదల జరిగేటప్పుడు వాటిని పెంపొందించడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి నిద్ర చాలా అవసరం. అయితే పిల్లలు అంత సామాన్యంగా నిద్రపోరు. మారాం చేస్తూ.. ఆడుకుంటూ కాలం గడుపుతుంటారు. పిల్లలు వారి వయసుని బట్టి ఎన్ని గంటల నిద్ర అవసరమో ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా ప్రీ-స్కూల్ వయసు పిల్లలకు రోజుకు 10, 12 గంటల నిద్ర అవసరం, తొమ్మిది ఏళ్ళ వయసులో దాదాపు 10 గంటలు, యుక్తవయసు వచ్చేటపుడు, ఎనిమిది, తొమ్మిది గంటల మధ్య నిద్ర అవసరం. అయితే ఎక్కువ మంది తక్కువ నిద్రపోతారు.
 
అందుచేత పిల్లల్ని నిద్రపుచ్చాలంటే.. 
టైమింగ్ తప్పనిసరి. ప్రతిరోజూ ఒకే సమయంలో లేవడం, చాలా అవసరం. పిల్లల్ని కూడా అదే టైమ్‌ను ఫాలో చేయించాలి. పిల్లలకు వేడినీటితో స్నానం చేయించాలి. ఆహారంలో కెఫీన్ లేకుండా చూసుకోవాలి. వీడియో గేమ్స్, టెలివిజన్ వంటి ఉద్రేకపరిచే కార్యక్రమాలను దూరం చేయాలి. బెడ్ రూమ్ ప్రశాంతతను మెరుగుపరిచేలా, శరీర ఉష్ణోగ్రతను తగ్గించేలా ఉండాలి. శబ్దాలు ఉండకుండా, తేలికైన రంగులను ఉపయోగించి, ఒక సౌకర్యవంతమైన మంచం... అక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు (కన్సోల్స్, కంప్యూటర్లు) ఉండకుండా చూసుకోవాలి. రాత్రిభోజనం ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్త పడాలి. కానీ ఆకలితో మంచం దగ్గరిగి వెళ్ళనీయకూడదు. 

వెబ్దునియా పై చదవండి