సీతాన‌గ‌రంలో జీయ‌ర్ స్వామి పుష్క‌ర యజ్ఞం

శుక్రవారం, 19 ఆగస్టు 2016 (16:03 IST)
గుంటూరు : శ్రావణ శుక్రవారం కృష్ణా పుష్క‌రాల‌కు భ‌క్త జ‌నం పోటెత్తారు. విజ‌య‌వాడ‌లో ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు హాజ‌ర‌వుతున్నారు. ఉద‌యం ప‌ది గంటలకు 80, 500 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మ‌రో ప‌క్క సీతాన‌గ‌రంలో త్రిదండి చిన జీయ‌ర్ స్వామి ఆధ్వ‌ర్యంలో పుష్క‌ర య‌జ్ఞం నిర్వ‌హించారు.
 
ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు స్వామీజీల‌తో పాటు ఏపీ దేవాదాయ‌శాఖ మంత్రి మాణిక్యాలరావు హాజ‌ర‌య్యారు. చినజీయర్ స్వామితో పుష్కర ఘాట్లో స్వాములు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పుష్క‌రాల 12 రోజులు సీతాన‌గ‌రంలో య‌జ్ఞయాగాదులు నిర్వ‌హిస్తున్న చిన‌జీయ‌ర్ స్వామి నిత్యం కృష్ణ‌కు పుష్క‌ర హార‌తి స‌మ‌ర్పిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి