పెళ్ళైన తర్వాత శ్రీమతి పలుకులు

మొదటి సంవత్సరం.. హలో..స్వీట్ హార్ట్ ( ప్రేమ ఒలకబోస్తూ) మగవాడు ఊహల్లో తేలిపోయేది ఈ సంవత్సరంలోనే.

రెండవ సంవత్సరం...ఏవండీ, వింటున్నారా ( కాస్త ప్రేమ తగ్గుముఖం పట్టడం)

మూడవ సంవత్సరం...ఇదిగో మిమ్మల్నే...(కరాఖండిగా)

నాల్గవ సంవత్సరం....చింటూ వాళ్ళ నాన్న...(పేరు, గౌరవం, మర్యాదలంటూ ఏమీవుండవు)

ఐదవ సంవత్సరం...ఎక్కడ చచ్చారు, మీతో ఏగలేక నేను ఛస్తున్నాను. (విసిగి వేసారిన తర్వాత)
అంటూ ఈసడించుకోవడం షరా మామూలే..

అదేనండి శ్రీమతిగారి ప్రేమంటే. వీటన్నింటికీ పురుషుడు ఊఁ...కొడుతూనే తన పని తాను చేసుకుపోవడం విశేషం అంటున్నారు పరిశోధకులు.

అదికూడా కేవలం ఐదు సంవత్సరాలలోనే ఎంత తేడావుంటుందో గమనించండి.

వెబ్దునియా పై చదవండి