నీకోసం...

గురువారం, 17 జులై 2008 (16:42 IST)
చేతిలోన పాలబువ్వతో పసివాని వెనక పరిగెత్తే అమ్మలా
గుండెలనిండా ప్రేమతో నీ వెనకే వస్తున్నా...

నిత్యం నీవువెళ్లే గుడిలోని పూజారినీ వేడుకుంటున్నా
హారతి పళ్లెంలో నువ్వు వేసే కానుకను నాకివ్వమని...

అన్నీ నీకోసం చేస్తున్నా... కాదు కాదు నాలో నిలిచిన నీకోసం చేస్తున్నా...
కానీ నీకోసం ఉన్న నాకోసం మాత్రం నీవేమీ చేయవు...

అయినా నీన్నేమీ అడగను ప్రియా... చివరకు నను ప్రేమించమని కూడా...
ఎందుకంటే నీకు నచ్చనిదేదీ నేను ఎన్నటికీ చేయను.

వెబ్దునియా పై చదవండి