ఎలాంటి పురుషులంటే స్త్రీలు ఇష్టపడుతారో తెలుసా?

సోమవారం, 3 ఏప్రియల్ 2017 (19:15 IST)
ఇది ప్రతి పురుషుడికీ తలెత్తే ప్రశ్న. పురుషులు ఎలా వుంటే స్త్రీలు ఇష్టపడతారనేది తెలుసుకునేందుకు ఉత్సుకత చూపిస్తుంటారు. అందుకోసమే పరిశోధకులు అలాంటి వాటిపై  మనుషులపై ఏదో ఒక విషయంపై శోధన చేస్తూనే ఉంటారు. తాజాగా మహిళలు ఎటువంటి పురుషులను ఇష్టపడతారు.. అనే దానిపై కెనడాకు చెందిన కొంతమంది పరిశోధకులు సుదీర్ఘమైన పరిశోధన చేశారట. వారి పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయట.
 
ఎప్పుడూ మూడీగా, ఏదో కోల్పోయినట్లుండే పురుషులను చూస్తే స్త్రీలు ఆకర్షితులవుతారట. పరిశోధనలో భాగంగా మూడీగా ఉన్నప్పుడు తీసిన కొంతమంది పురుషుల ఫోటోలను, సంతోషంగా నవ్వుతూ కాలం గడిపే వారి ఫోటోలను ఎంపిక చేసుకున్న మహిళలకు చూపించారట. వారిలో అధికులు మూడీ మగాళ్లంటేనే అమితాసక్తిని చూపారట.
 
అయితే పురుషుల మనస్తత్వం ఇందుకు భిన్నంగా ఉన్నట్లు వారు కనుగొన్నారట. అదేమంటే, ఎప్పుడూ నవ్వుతూ ఉండే మహిళలంటే పురుషులు ఇష్టపడుతున్నట్లు తేలిందట.

వెబ్దునియా పై చదవండి