ప్రేమికుల మధ్య అహం వద్దండి... మానసికంగా దగ్గరవ్వాలంటే?

శుక్రవారం, 6 మార్చి 2015 (16:20 IST)
ప్రేమికుల మధ్య అహంకారం ఉండకూడదు. మనం స్పందించే తీరు అహంపై ఆధారపడకూడదు. ఒక మాటతో మానసికంగా దగ్గరయ్యే అవకాశం ఉన్నప్పుడు ఆ మాట చెప్పటానికి అహంభావం అడ్డుపడతకూడదు. ప్రేమికుల మధ్య ఎక్కువ, తక్కువలనే తారతమ్యాలు ఉండకూడదు. 
 
మరీ ముఖ్యంగా ప్రేమను వ్యక్తం చేసుకునేందుకు వీలుండే సన్నిహిత సమయాల్లో అహంభావాన్ని పక్కకు తోసేసి మానసికంగా దగ్గరచేసే మాటలు, చేతలకు వీలు కల్పించాలి. తక్కువైపోతామనో, చులకనైపోతామనో, బెట్టు సడలిపోతుందనే అర్థం లేని భావనలు వదిలేసి ప్రేమ వారధకి ఊతమిచ్చేలా వ్యవహరించాలి. ప్రతి మాట, చర్య ప్రేమ సమతూకంలో ఉండేట్లు సాగాలి. 
 
భాగస్వామిపై గౌరవం పెంచుకోండి. మీరెలాంటి గుర్తింపు, విలువ పొందాలనుకుంటున్నారో అంతే విలువ, గుర్తింపు ప్రేమిస్తున్న వ్యక్తి ఫీలయ్యేలా ప్రవర్తించాలి. భాగస్వామితోపాటు వారి ఇష్టాఇష్టాలు, అభిప్రాయాలు, హద్దులు, బలహీనతలు కూడా గౌరవించాలని లవ్ గురూస్ సలహా ఇస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి